: పండ్లను ర‌సాయ‌నాల‌తో మాగబెట్టడంపై హైకోర్ట్ మ‌రోసారి సీరియ‌స్‌


కార్బైడ్ వంటి వివిధ రసాయనాలతో పండ్లను మాగబెడుతున్న వ్యాపారులు ఉగ్రవాదులు కన్నా ప్రమాదకారులని, అటువంటి వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని గ‌తంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు మ‌రోసారి ఈ విష‌యంపై స్పందిస్తూ.. మార్కెట్‌లో పండ్లు కొనాలంటే భయంగా ఉందని వ్యాఖ్యానించింది. రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మాగబెట్టడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇథిలిన్‌తో కాయలను మాగబెట్టే కేంద్రాలను నిర్ణీత కాలంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు సూచించింది. దీనిపై స్పందించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు సూచనలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరణ ఇచ్చాయి.

  • Loading...

More Telugu News