: గద్దెనెక్కిన మెహబూబా!... కాశ్మీర్ కు తొలి మహిళా సీఎంగా రికార్డు


పీడీపీ నేత మొహబూబా ముఫ్తీ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. జమ్మూ కాశ్మీర్ కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. సీఎం పీఠంలో ఉండగానే మెహబూబా తండ్రి ముఫ్తీ మొహ్మద్ సయీద్ చనిపోయిన సంగతి తెలిసిందే. తండ్రి మరణంతో రోజుల తరబడి తీవ్ర వేదనలో కూరుకుపోయిన మెహబూబా ఆ తర్వాత బయటకు వచ్చినా, వెనువెంటనే సీఎం పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. మిత్రపక్షం బీజేపీ విడతలవారీగా జరిపిన చర్చలతో మొహబూబా ఎట్టకేలకు సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం మేరకు కొద్దిసేపటి క్రితం ఆమె జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. దీంతో ఆ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తొలి మహిళా నేతగా మొహబూబా రికార్డులకెక్కారు.

  • Loading...

More Telugu News