: అదో ఫేక్ సూసైడ్ బెల్టట... కాక్ పిట్ లోకే రాకుండా విమానం హైజాక్!


గత వారంలో ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన హైజాకర్ సైఫ్ అల్ దిన్ మహమ్మద్ మొస్తాఫా, తన నడుముకు ధరించినది అసలు సూసైడ్ బాంబే కాదట. అట్ట ముక్కలను బాంబు మాదిరిగా చూపించాడట. దాదాపు ఆరు గంటలకు పైగా హైజాక్ ఉదంతం కొనసాగగా, ఒక్కసారి కూడా కాక్ పిట్ లోకి రాలేదని, అసలు ఆ ప్రయత్నమే చేయలేదని విమానం పైలట్ అమల్ అల్ గమాల్ వెల్లడించారు. ప్రస్తుతం సైప్రస్ లో పోలీసుల కస్టడీలో ఉన్న మొస్తాఫా, తన మాజీ భార్య, పిల్లలను చూపించాలని డిమాండ్ చేస్తూ, విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. హైజాకర్ కాక్ పిట్ లోకి వస్తాడేమో, అతనికి విమానం నడపటం తెలుసునేమో అని భయపడినట్టు కో-పైలట్ హమద్ అల్ ఖద్దా వ్యాఖ్యానించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాతనే తాము కాక్ పిట్ నుంచి బయటకు వచ్చామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News