: ప్రత్యూష రెండు నెలల గర్భవతి?... కొత్త మలుపు తిరిగిన ‘చిన్నారి పెళ్లికూతురు’ నటి కేసు
టీవీ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రోజుల క్రితం ముంబైలోని తన సొంతింటిలో ప్రత్యూష ఫ్యానుకు ఉరేసుకున్న స్థితిలో విగత జీవిగా కనిపించింది. సీరియల్స్ నిర్మాత, నటుడు రాహుల్ రాజ్ సింగ్ తో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న ప్రత్యూష... అతడితో పెళ్లి కాకుండానే ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో నిన్న ఓ సంచలన విషయం వెలుగు చూసింది. చనిపోయే సమయానికి ప్రత్యూష రెండు నెలల గర్భిణీ అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించినా, పోస్టు మార్టం నివేదిక అందిన తర్వాతే ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ప్రత్యూష, రాహుల్ రాజ్ లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే పెళ్లి కాకుండానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది.