: చదువు పూర్తయిన తర్వాత మళ్లీ యాక్టింగ్ చేస్తా: హీరోయిన్ అవికాగోర్
తన చదువు పూర్తయిన తర్వాత మళ్లీ యాక్టింగ్ చేస్తానని యువ హీరోయిన్ అవికాగోర్ వెల్లడించింది. బుల్లి తెర సీరియల్ 'చిన్నారి పెళ్లికూతురు'తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అవికాగోర్ తెలుగులో నాలుగు సినిమాల్లో నటించింది. ప్రస్తుతానికి చదువుపై దృష్టి పెట్టాలని, ఈ నేపథ్యంలోనే నటనకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అయితే, తాను పూర్తిగా నటనకు దూరం కావట్లేదని, చదువు పూర్తవ్వగానే మళ్లీ ఈ రంగంలోకి వస్తానని.. ఇది కేవలం టెంపరరీ బ్రేక్ మాత్రమేనని పేర్కొంది. కాగా, 'చిన్నారి పెళ్లికూతురు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని అవికాగోర్ పేర్కొంది.