: రాహుల్ హస్తం లేదు... డబ్బు ఇబ్బందులతోనే ప్రత్యూష ఆత్మహత్య: పోలీసులు


బుల్లితెర హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ మరణం వెనుక, ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ హస్తం లేదని ముంబై పోలీసులు వెల్లడించారు. రాహుల్ ను దాదాపు 14 గంటల పాటు విచారించిన అనంతరం, ఈ విషయాన్ని తెలిపిన పోలీసులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, కేసును మరింతగా విచారిస్తున్నామని తెలిపారు. కాగా, ఆమెకు ఎలాంటి డబ్బు ఇబ్బందీ లేదని ప్రత్యూష ఫ్రెండ్స్ చెబుతుండగా, తమ కుమార్తె మరణం వెనుక రాహుల్ హస్తం ఉందని భావించడం లేదని ఆమె తల్లిదండ్రులు అంటుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News