: తెలంగాణలో టీడీపీతో తెగతెంపులే: బండారు దత్తాత్రేయ
తెలంగాణలో ఇకపై ఏ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేయబోమని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాసకు కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఆయన అన్నారు. ఈ ఉదయం జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి కోసం కేంద్ర పార్టీ ఏకాభిప్రాయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా మాయమైనట్టేనని వ్యాఖ్యానించిన ఆయన, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలను దశలవారీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడివుందని వెల్లడించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తుపై భవిష్యత్ నిర్ణయాలను మాత్రం ప్రస్తావించలేదు.