: గోల్డెన్ కేలా 'చెత్'త అవార్డులు... ఈయేటి అత్యంత చెత్త సినిమా 'దిల్ వాలే', చెత్త నటి సోనమ్ కపూర్


షారూక్ ఖాన్, కాజోల్ కలిసి నటించిన 'దిల్ వాలే' చిత్రం 2015 సంవత్సరానికిగాను అత్యంత చెత్త చిత్రంగా నిలిచింది. భారత సినీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్ల ఆధారంగా, చెత్త సినిమాలు, చెత్త ప్రదర్శనలకు అవార్డులను ఇస్తూ జరిగే గోల్డెన్ కేలా 8వ విడత అవార్డుల కార్యక్రమం జరుగగా, బాంబే వెల్వెట్, షాన్ దార్, తేవర్, సింగ్ ఈజ్ బ్లింగ్ తదితర ఫ్లాప్ చిత్రాలను వెనక్కు నెట్టి చెత్త చిత్రం జాబితాలో దిల్ వాలే నిలిచింది. ఇదే సమయంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' హీరోయిన్ సోనమ్ కపూర్ కు వరెస్ట్ యాక్ట్రెస్ గా, దర్శకుడు సూరజ్ బర్ జాత్యా చెత్త దర్శకుడిగా నిలిచారు. ఇక చెత్త నటుడిగా సూరజ్ పాంచోలీకి సినీ అభిమానులు ఓట్లేశారు. ఈ సంవత్సరపు చెత్త గీతంగా ప్రేమ్ రతన్ ధన్ పాయో టైటిల్ సాంగ్ ఎంపికైంది. వీటితో పాటు పలు విభాగాల్లో 'చెత్త' అవార్డులను గోల్డెన్ కేలా ప్రకటించింది.

  • Loading...

More Telugu News