: సరికొత్త అధ్యాయం... ఇండియాలోనే అత్యంత వేగవంతమైన రైలిది!


భారత రైల్వేల చరిత్రలో మరో మైలురాయి నమోదు కానుంది. దేశంలోనే అత్యధిక వేగంతో నడిచే గతిమాన్ ఎక్స్ ప్రెస్ సేవలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఆగ్రాకు ఈ రైలు పరుగులు పెట్టనుంది. మంగళవారం ఉదయం ఈ రైలును కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. ఉదయం 8:10కి బయలుదేరే రైలు ఆగ్రాకు 9:50కి చేరనుంది. ఈ రెండు స్టేషన్ల మధ్యా 211 కిలోమీటర్ల దూరం ఉండగా, తొలుత 90 నిమిషాల వ్యవధిలో ప్రయాణం పూర్తవుతుందని అధికారులు చెప్పినప్పటికీ, ఆపై సమయాన్ని మరో 10 నిమిషాలు పెంచారు. కాగా, ఈ రైలులో అన్నీ ఎయిర్ కండిషన్డ్ కోచ్ లుంటాయి. ప్రతి కోచ్ లో హోస్టెస్ లు, వైఫై, ఆటోమేటిక్ డోర్లు తదితర సదుపాయాలుంటాయి. శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో పోలిస్తే దీనిలో ప్రయాణానికి ధర అధికం. తాజ్ మహల్ మూసివుండే శుక్రవారం మినహా, మిగతా అన్ని రోజుల్లో ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు గంటకు 150 కి.మీ కన్నా అధిక వేగంతో ప్రయాణించగలుగుతుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News