: ఈ జన్మకి 'కొబ్బరిమట్ట' సినిమా ఒకటి చాలనిపిస్తోంది: సంపూర్ణేష్ బాబు


ఈ జన్మకి 'కొబ్బరిమట్ట' సినిమా ఒకటి చాలనిపిస్తోందని 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేష్ బాబు చెప్పాడు. మరో పది రోజుల్లో 'కొబ్బరిమట్ట' ట్రైలర్ రిలీజ్ కానుందని సంపూర్ణేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. 'కొబ్బరిమట్ట' ట్రైలర్ 'హృదయకాలేయం'ను తలదన్నేలా ఉంటుందని సంపూర్ణేష్ బాబు చెప్పాడు. ఎప్పటిలాగే ప్రేక్షకులు తమ ప్రేమాభిమానాలతో ట్రైలర్ ను ఆదరించి ఆశీర్వదించాలని కోరాడు. ఈ జన్మకి ఇది చాలనిపిస్తోందని, 'కొబ్బరిమట్ట' తన జీవితానికి దొరికిన ఆణిముత్యమని సంపూర్ణేష్ బాబు తెలిపాడు. ఈ సందర్భంగా ఎడిటింగ్ లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, తనలోని నటుడిని చూడాలని కోరాడు. కాగా, సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియా ద్వారా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News