: పోప్ ఫ్రాన్సిస్ వాడిన కారు 12 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది


కేథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అమెరికాలోని న్యూయార్క్ పర్యటన సందర్భంగా వినియోగించిన కారు భారీ ధరకు అమ్ముడుపోయింది. కారు వాస్తవ ధర కంటే 12 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడంతో ఈ కారును వేలం వేసిన సంస్థ హర్షం వ్యక్తం చేసింది. పోప్ ఫ్రాన్సిస్ వాడిన ఫియట్ 500 లాంజ్ హచ్ బ్యాక్ కారు అసలు ధర కంటే 12 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయినట్టు తెలిపింది. మూడు లక్షల డార్లకు ఈ కారును వేలం వేసినట్టు చెప్పింది. దీనిని వ్యాపారవేత్త మిల్లీస్ నడాల్ వేలంలో దక్కించుకున్నారు. ఆయన దగ్గర 130 కార్లు, మోటారు బైకులు ఉన్నాయి. వేలం ద్వారా వచ్చిన ఈ మొత్తం న్యూయార్క్ లోని కేథలిక్ పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలైన కేథలిక్ రిలీఫ్ సర్వీసెస్, కేథలిక్ నియర్ ఈస్ట్ అసోసియేషన్ కు వెళ్తాయి. కాగా, పోప్ వాడిన మరో కారును కూడా వేలం వేయనున్నట్టు న్యూయార్క్ ఆర్చ్ డయోసిస్ తెలిపింది.

  • Loading...

More Telugu News