: పాకిస్థాన్ లో దారుణం ...బాలిక శీలానికి 1,140 కేజీల గోధుమల వెలకట్టిన జిర్గా!


పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలోని ఉమర్ కోట్ జిల్లాలో గులాంనబీషా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక సోదరుడు పోలీస్ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో అతడు బాలిక తండ్రితో సమస్యను జిర్గా (గ్రామ పెద్దల సమక్షం) లో పరిష్కరించుకుందామని ప్రతిపాదించాడు. ఆయన అగీకరించడంతో పోలీస్ స్టేషన్ నుంచి తగవు జిర్గాకు వచ్చింది. దీంతో జరిగిన ఘటనపై విచారించిన జిర్గా, నిందితులను బాధితురాలికి 1,140 కేజీల గోధుమలు చెల్లించాలని ఆదేశించింది. ఇక పోలీస్ స్టేషన్ కు వెళ్లవద్దని, తీర్పును వ్యతిరేకిస్తే గ్రామబహిష్కరణ శిక్ష విధిస్తామని హెచ్చరిచింది. దీంతో బాలిక తండ్రి దీనిని వ్యతిరేకించాడు. ఈ తతంగం మొత్తాన్ని మీడియా ప్రసారం చేయడంతో దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో స్పదించిన డిప్యూటీ ఇన్ స్పెకర్టర్ జనరల్ జావెద్ ఆలం దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. జిర్గా ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటారన్న విషయం తనకు తెలియదని ఆయన తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News