: ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య బాధ క‌లిగించింది: రిషి కపూర్


‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై బాలీవుడ్ ప్ర‌ముఖులు రిషి కపూర్, సిమీ గరేవాల్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. 'అంత మంచి అమ్మాయి అర్థాంతరంగా జీవితాన్ని ముగించడం బాధ కలిగించింది, ఆమెలోని దుఃఖం ఎవరికి తెలుసంటూ' ప్రత్యూష మృతి పట్ల ట్వీట్ చేశారు. బాలికా వధు సీరియల్ ఒక్కటే తాను చూస్తానని సిమీ గరేవాల్ అన్నారు. 24 ఏళ్లకే ఆమె తనువు చాలించడం బాధాక‌ర‌మ‌న్నారు. కుటుంబ మద్దతు లేకుండా ఆడపిల్లల మనుగడ చాలా కష్టమవుతుందని ఆమె ట్వీట్ చేశారు. టీవీ నటీనటులు సోఫీ చౌదరి, కరిష్మా తన్నా, మికా సింగ్, గౌర్ ఖాన్ కూడా ప్రత్యూష బెనర్జీ మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News