: నేతన్నకు ఎయిరిండియా దన్ను!...వీవీఐపీ ఫ్లైట్లలో ఇకపై ఖాదీ దుస్తుల్లోనే సిబ్బంది


చాలీ చాలని ఆదాయంతో దుర్భర జీవనం సాగిస్తున్న చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వ విమానయాన రంగ సంస్థ ‘ఎయిరిండియా’ ముందుకొచ్చింది. ఇకపై వీవీఐపీలు ప్రయాణించే తమ విమానాల్లో సిబ్బంది ఖాదీ వస్త్రాల్లోనే కనిపించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిరిండియా... ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సమాఖ్య మధ్య ఓ ఒప్పందం కుదిరింది. నిర్ణయం తీసుకున్న వెంటనే ఎయిరిండియా దానిని అమల్లోకి కూడా తెచ్చేసింది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు ఎయిరిండియా విమానంలోనే బయలుదేరారు. ఈ విమానంలోని సిబ్బంది మొత్తం ఖాదీ వస్త్రాలనే ధరించారు. ఇకపై వీవీఐపీలు ప్రయాణించే తన అన్ని విమాన సర్వీసుల్లో ఖాదీ వస్త్రాలతోనే విధులకు హాజరుకావాలని ఆ సంస్థ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది డ్రెస్ తో పాటు విమానాల్లో వినియోగించే శానిటైజర్, మాయిశ్చరైజర్, లోషన్, లెమన్ గ్రాస్ తదితర 25 కిట్ల కోసం గత నెలలో రూ.1.21 కోట్ల విలువైన ఆర్డర్ ను ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ కు ఎయిరిండియా ఇచ్చింది.

  • Loading...

More Telugu News