: ఉత్తర కొరియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, పెను ప్రమాదం పొంచి ఉంది: ఒబామా
ఉత్తర కొరియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ దేశం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అణుభద్రత శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అణు భద్రత కోసం చేయాల్సింది చాలా ఉందని నమ్మేవారిలో తాను మొదట ఉంటానన్నారు. ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చైనా సమీప దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌తో అణ్వాయుధాలపై ప్రత్యేక చర్చలు నిర్వహించినట్లు ఒబామా తెలిపారు. అణు భద్రత విషయంలో అమెరికా గణనీయమైన ప్రగతిని సాధించిందని, దక్షిణ అమెరికా దేశాలతో పాటు యూరోప్, ఇండోనేషియా దేశాలు అణ్వాయుధాలను తగ్గించుకుంటున్నాయని ఒబామా తెలిపారు. అమెరికాలో అణు భద్రతను, అణు భద్రత కోసం ఏర్పాటు చేసిన శిక్షణను పెంచామన్నారు. తమ దేశంలో యురేనియం వాడకాన్ని తగ్గించామన్నారు. ఐఎస్ఎస్, ఇరాన్ తో అణు ఒప్పందం అంశాలు అణుభద్రతా సదస్సులో కీలక అంశాలుగా మారాయన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాలు అణ్వాయుధాల సమీకరణను తగ్గించుకోవాలని అన్నారు.