: చిన్నారి పెళ్లి కూతురుది ఆత్మహత్య కాదా?... లవర్ కోసం పోలీసుల వేట


‘బాలికా వధు’ నటి ప్రత్యూష ఆత్మహత్య ఘటన బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. నిన్న తన సొంతింటిలో ఫ్యాన్ కు ఉరేసుకున్న స్థితిలో ప్రత్యూష చనిపోయింది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పరిశీలించిన ఆమె మిత్రులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష ముఖంపై గాయాలున్నాయని పేర్కొన్న వారు ఆమెను పక్కాగా వేసిన ప్లాన్ ప్రకారమే హత్య చేశారని ఆరోపించారు. ఇదిలా ఉంటే, కొంతకాలంగా మరో నటుడు రాహుల్ రాజ్ సింగ్ తో ప్రత్యూష ప్రేమాయణం కొసాగిస్తోంది. ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగా రాహుల్ కు ఓ మెసేజ్ పెట్టినట్లు సమాచారం. ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి రాహుల్ అడ్రెస్ లేకుండా పోయాడు. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. ప్రత్యూష స్నేహితుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రాహుల్ కోసం వేట ప్రారంభించారు. అదే సమయంలో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ప్రత్యూషది హత్యా? ఆత్మహత్యా? అన్న విషయం తేలిపోతుందని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News