: కోల్ కతా ఫ్లైఓవర్ కింద నలిగిపోయిన కర్నూలు జిల్లా వాసి


పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కుప్పకూలిపోయిన వివేకానంద ఫ్లైఓవర్ కింద నలిగి చనిపోయిన వారిలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు తేలింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన లారీ క్లీనర్ రజాక్ కోల్ కతా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓ లారీకి క్లీనర్ గా పనిచేస్తున్న రజాక్, కర్ణాటకలోని చిరాలగుప్ప నుంచి అల్లం లోడును డ్రైవర్ ముర్తుజాతో కలిసి కోల్ కతా తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో కోల్ కతాలో అల్లం లోడును దించేసిన రజాక్ తిరిగి వస్తున్న క్రమంలో వారి లారీ ఫ్లైఓవర్ కిందకు చేరుకున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ దిమ్మెలు పడిపోవడంతో లారీ నుజ్జునుజ్జైంది. లారీ క్యాబిన్ లో ఉన్న రజాక్ అక్కడికక్కడే చనిపోగా, డ్రైవర్ ముర్తుజా తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News