: కేటాయింపులయ్యాక పవర్ పాయింట్ ప్రెజెంటేషనా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ కేటాయింపులు పూర్తయ్యాక చర్చ జరపడంలో అధికార పార్టీ ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పెద్ద కుంభకోణమని ఆయన ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్లో భ్రమలు కల్పించారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో మాటలు తప్ప చేతలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సభా సంప్రదాయాలకు విరుద్ధమని, సభా సంప్రదాయాలను తప్పిన ఘనత కేసీఆర్ కే చెల్లుతుందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News