: 59 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్థాన్ అధికారులు


పాకిస్థాన్ ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న భారత్‌కు చెందిన 59 మంది మత్స్యకారులను పాక్‌ అధికారులు అరెస్టు చేశారు. ఆ దేశ‌ నౌకాదళ భద్రత సిబ్బంది వీరిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. జాలర్లను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసినట్లు పాక్ అధికారులు మీడియాకు తెలిపారు. వివాదాస్పద జలాల్లో చేపల వేట కారణంగా పాక్‌, భారత జాలర్లు తరచూ అరెస్టవుతుంటారు. ఇటీవల పాకిస్థాన్‌ భారత్‌కు చెందిన 86 మంది జాలర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భార‌త్‌ కూడా మార్చి 17న దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న 9 మంది పాకిస్థాన్‌ మత్స్యకారులను భారత్ విడిచిపెట్టింది.

  • Loading...

More Telugu News