: ఆమే.. ఆ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి మ‌హిళా సీఎం.. భార‌త్‌లో సీఎంగా రెండో మ‌హిళా ముస్లిం


పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ మొట్ట‌మొద‌టి మ‌హిళా ముఖ్యమంత్రిగా ఈ నెల నాలుగో తేదీన‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని పీడీపీ వర్గాలు ధ్రువీకరించాయి. అంతేకాదు.. భార‌త్‌లో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న రెండో మ‌హిళా ముస్లిం కూడా ఆమే. ఇది మంచి సంకేతాలనిస్తోంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. నెలల తరబడి రాష్ట్రంలో బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొల‌గిస్తూ.. ఏప్రిల్ 4న మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న సమాచారాన్ని ఇప్పటికే గవర్నర్ ఎన్ఎన్ వోరాకు తెలియజేసినట్లు పీడీపీ తెలిపింది. దేశంలోనే మొట్ట‌మొద‌టి మ‌హిళా ముఖ్య‌మంత్రిగా అస్సాం రాష్ట్రం నుంచి 'అన్వారా తైముర్' సుమారు 7 నెల‌లు బాధ్య‌త‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అన్వారా తైముర్.. డిసెంబ‌ర్ 6, 1980 నుంచి జూన్ 30, 1981వ‌ర‌కు ముఖ్య మంత్రిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News