: రైలులో పిల్లలకు ప్రత్యేక సీటు కావాలనుకుంటే పూర్తి ఛార్జీలు చెల్లించాల్సిందే
రైలులో 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక సీటు కావాలనుకుంటే వారి నుంచి పూర్తి ఛార్జీ వసూలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. పిల్లలకు పూర్తి ఛార్జీని వసూలు చేసే విధానంలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. రిజర్వేషన్ చేసుకునేటప్పుడే పిల్లలకు సీటు కావాలా.. లేదా? అనే విషయం తెలపాలి. సీటు వద్దనుకునే పిల్లలకు మాత్రం సగం ఛార్జీలే వసూలు చేస్తారు.