: ఉపమాక వెంకటేశ్వరాలయంలో అపచారం... ‘మందు, విందు, పొందు’తో ఉద్యోగుల ఎంజాయ్


పవిత్ర ఆలయాల్లో అపచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న అప్పన్న ఆలయ ప్రాంగణంలో అశ్లీల నృత్యాలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కలకలం రేపాయి. తాజాగా విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. అత్యంత ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దత్తత తీసుకుంది. ఈ క్రమంలో ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు ‘మందు, విందు, పొందు’తో ఎంజాయ్ చేస్తున్నారు. పవిత్ర ఆలయంలో ఉద్యోగులు వెలగబెడుతున్న ఈ దుర్మార్గంపై సమాచారం అందుకున్న ఉపమాక గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఆలయ సత్రంలో ఓ మహిళతో ఆలయ ఉద్యోగులు వెలగబెడుతున్న రాసలీలను యువకులు సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఈ దృశ్యాలను వారు నిన్న ఓ తెలుగు దినపత్రికకు అందజేశారు. సదరు ఫొటోలతో మొత్తం వ్యవహారంపై ఆ పత్రిక సమగ్ర కథనం రాసింది. ఈ కథనంతో నేటి ఉదయం ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. దీనిపై వేగంగా స్పందించిన టీటీడీ అధికారులు... ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News