: కాసేపట్లో శ్రీజ వివాహ విందు...హాజరు కానున్న సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు
ప్రముఖ నటుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ విందు హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో ప్రారంభం కానుంది. బెంగళూరులోని తమ ఫాం హౌస్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా కుమార్తె వివాహం జరిపించిన చిరంజీవి నేడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందుకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరుకానున్నారు.