: ఏపీకి 900 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన కేంద్రం


ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. రెవెన్యూలోటు భర్తీకి 500 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 200 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మరో వారం రోజుల్లో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పన్నుల వాటాలో భాగంగా రావాల్సిన 650 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మొత్తంతో పాటు మరో 900 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News