: కోల్‌క‌తా ఘ‌ట‌న‌పై తీవ్ర‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్ర‌ధాని మోదీ


కోల్‌క‌తాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలి 14 మంది మరణించి, 150 మంది శిథిలాల కింద చిక్కుకున్న సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సహాయ కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని ట్వీట్ చేశారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్ర‌ధాని మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News