: నటుడిని అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు!: డానిష్ అక్తర్
‘నటుడిని అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇదంతా ఒక కల లాగా జరిగిపోయింది’ అని పౌరాణిక సీరియల్ ‘సియా కే రామ్’ లో హనుమంతుడి పాత్రధారి, ప్రముఖ రెజ్లర్ డానిష్ అక్తర్ అన్నాడు. ఓ రెజ్లింగ్ మ్యాచ్ లో పాల్గొన్నప్పుడు ఈ సీరియల్ దర్శకుడు నిఖిల్ సిన్హా తనని చూశారని, అప్పుడే, ఈ సీరియల్ లో నటించేందుకు తనని ఎంపిక చేశారని చెప్పాడు. దర్శకుడు కోరుకున్న విధంగా నటించేందుకు తాను కృషి చేస్తున్నానని చెప్పాడు. హనుమంతుడి పాత్ర ధారి డానిష్ నటించిన ఎపిసోడ్స్ ఇంకా ప్రసారం కావాల్సి ఉంది. కాగా, సియా కే రామ్ హిందీ సీరియల్ స్టార్ ప్లస్ లో ప్రసారమవుతోంది.