: 14 గొలుసు దొంగతనాలు... నిందితుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం!


హైదరాబాద్ నగరంలో పలు గొలుసు దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాదుల్లో మొత్తం 14 చోట్ల గొలుసుల చోరీలకు నిందితుడు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, నిందితుడు ఉత్తరప్రదేశ్ బవేరియా గ్యాంగ్ కు చెందిన అంతర్రాష్ట్ర గొలుసు దొంగల ముఠాకు చెందిన వాడని తెలిపారు. నిందితుడిని విచారణ జరిపి మరిన్ని వివరాలు రాబడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News