: ఏడు సార్లు గెలిచారుగా!.. కుప్పంకు ఏం చేశారు?: చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ధ్వజం


వైసీపీ యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కింద పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటుకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ... చంద్రబాబు తనను కొత్త ఎమ్మెల్యే అంటూ సంబోధించారని, జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. ‘‘నేను మొదటిసారి ఎంపికయ్యాను. కానీ సీఎం చంద్రబాబు ఏడుసార్లు ఎన్నికైన కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికీ 65 శాతం పాఠశాలల్లో మంచినీరు కానీ, మరుగుదొడ్లు కానీ లేవు. చంద్రబాబు తొలుత కుప్పంను ఆదర్శంగా అభివృద్ధి చేయాలి’’ అని అనిల్ కుమార్ అన్నారు.

  • Loading...

More Telugu News