: వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది టచ్ లో ఉన్నారు... ఎంతమంది వస్తారో తెలియదు!: బొండా ఉమ


ఏపీలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ లో అధికార పక్షం టీడీపీ, విపక్షం వైసీపీకి చెందిన సభ్యుల మధ్య ఆసక్తికర వాదన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 8 మంది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ పార్టీలో చేరారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన నేపథ్యంలో వారంతా తమ పార్టీలో చేరారని ఆయన పేర్కొన్నారు. ఇంకా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పిన ఆయన, ఎంతమంది తమ పార్టీలో చేరతారో తెలియదని వ్యాఖ్యానించారు. రేపో, మాపో మరో ఎమ్మెల్యే తమ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News