: టాస్ గెలిచిన ఇంగ్లండ్...న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగింత
ఢిల్లీలోని మొహాలీ వేదికగా జరగనున్న టీ20 తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఆరంభించనుంది. పిచ్ బౌలింగ్ కు అనుకూలించడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లను కట్టడి చేసి, లక్ష్యసాధన చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అయితే టోర్నీ ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న కివీస్ ఆటగాళ్లు ఇప్పటి వరకు భారీ టార్గెన్ ను నిర్ణయిస్తూ వచ్చారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన వారికి ఫైనల్ బెర్తు ఖరారు కానుండడంతో రెండు జట్లు హోరాహోరీ తలపడనున్నాయి.