: స్వాతంత్ర్యం వచ్చిన 68 ఏళ్లకు ఆ వూరికి బస్సొచ్చింది!


స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా నాగరిక ప్రపంచానికి దూరంగా చాలా ప్రాంతాలు ఉండడం భారతదేశ దుస్థితికి అద్దంపడుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 68 ఏళ్లకి మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలోని ఖైరిసీతా గ్రామానికి తొలిసారిగా బస్సు వచ్చింది. తమ గ్రామానికి తొలిసారి వచ్చిన బస్సును చూసిన ప్రజలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. సుమారు 400 మంది ప్రజలు నివసించే ఈ గ్రామానికి దశాబ్దాలుగా బస్సు సౌకర్యం లేదు. దీంతో ఊరి నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. కనీసం చదువుకునేందుకు వెళ్లాలన్నా కాలినడకే దిక్కయ్యేది. తాజాగా బస్సు సౌకర్యం కల్పించడంతో గ్రామంలో ప్రజలకు మరిన్ని అవకాశాలు దగ్గరవుతాయని ఆ గ్రామీణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News