: యువీ అవుట్...మనీష్ ఇన్: బీసీసీఐ
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గాయం కారణంగా రెండు సార్లు గిలగిల్లాడిన యువరాజ్ సింగ్ ఇప్పుడు ఆ గాయం తీవ్రత కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దీంతో యువరాజ్ సింగ్ స్థానంలో మనీష్ పాండేను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. యువీ గాయంపై జట్టు మేనేజ్ మెంట్ నుంచి సమాచారం అందుకున్న సెలెక్టర్లు సమావేశమై మనీష్ పాండేను తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడిన యువరాజ్ సింగ్ కేవలం 63 పరుగులే చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గెలుపులో తన పాత్ర పోషించాడు.