: 2015లో సుందర్ పిచాయ్ మొత్తం వేతనం 667 కోట్లు!


గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 2015లో ఎంత జీతం తీసుకున్నారో తెలుసా?...రెగ్యులేటరీ ఫిల్లింగ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం సుందర్ పిచాయ్ 2015లో 667 కోట్ల (100.5 మిలియన్ డాలర్లు) రూపాయల జీతం తీసుకున్నారు. జీతం కింద 652,500 డాలర్లు అందుకున్న సుందర్ పిచాయ్, రిస్ట్రిక్టెడ్ వాటాల రూపంలో 99.8 మిలియన్ డాలర్లు తీసుకున్నారు. ఇతర భత్యాల రూపంలో 22,935 డాలర్లు అందుకున్నారు. ఈ మొత్తాన్ని ఆయన 2017 తరువాత డబ్బు రూపంలోకి మార్చుకోవచ్చు. 2004లో గూగుల్ లో ప్రోడక్ట్ మేనేజ్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా చేరిన ఆయన 2008లో గూగుల్ క్రోమ్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ గూగుల్ సీఈవో స్థాయికి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News