: కన్నబిడ్డ నాలుక కోసేసిన తల్లి!


కన్నబిడ్డలు అల్లరి చేస్తుండటంతో వారిని వారించలేక విసిగిపోయిన ఒక తల్లి దారుణానికి పాల్పడింది. తన బిడ్డ నాలుక కోసేసింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్, బీర్భమ్ జిల్లాలోని కోయ్కాగ్రామంలో జరిగింది. మారాం చేస్తున్న ఇద్దరు పిల్లలు తమ తల్లితో గొడవపడ్డారు. వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన తల్లి, కొడుకు నాలుక కోసేసింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News