: ఇందులో నా కుమారుడి త‌ప్పేంలేదు, వాడిపై విమ‌ర్శ‌లొద్దు: విజయ్‌ మాల్యా


రుణాల చెల్లింపు కేసులో తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యాను విమ‌ర్శిస్తున్నారంటూ.. విదేశాల్లో త‌ల‌దాచుకుంటున్న‌ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ట్విట్టర్‌ ద్వారా మండిపడ్డారు. బ్యాంక్‌ రుణాలు చెల్లించ‌ని కేసులో త‌న‌ కుమారుడి తప్పేంలేదని చెప్పారు. రుణాలు చెల్లించాల్సింది తానే కానీ సిద్ధార్థ్‌ కాదని పేర్కొన్నారు. 'తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, వాడిని కాదు’ అంటూ ట్వీట్ చేశారు. బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగవేసి దేశం వీడిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు విజయ్‌మాల్యా.. మార్చి 2న భారీ బ్యాగులను వెంటేసుకుని విమానం ఎక్కినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన లండన్ కు వెళ్లిపోయినట్టు సుప్రీంకోర్టుకు సీబీఐ స్వయంగా వెల్లడించింది. హవాలా మార్గం ద్వారా ఆయన డబ్బు తరలించారా? అన్నది తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News