: తూచ్!... ఆరోగ్యం బాగానే ఉందట!: ఏపీ అసెంబ్లీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రత్యక్షం


ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఓటింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని వైసీపీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. తన పార్టీ టికెట్ పై విజయం సాధించి ఆ తర్వాత టీడీపీలో చేరిపోయిన 8 మంది ఎమ్మెల్యేలపై చర్యలకు శ్రీకారం చుట్టేందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విప్ ను జారీ చేశారు. జగన్ ఎత్తుగడలను ముందే పసిగట్టిన పార్టీ మారిన ఎమ్మెల్యేలు విప్ కు చెక్ పెట్టేందుకు సభకు హాజరుకావడం లేదని స్పీకర్ కు లేఖలు రాశారు. అనారోగ్యం కారణంగా తాము నేటి సభకు హాజరుకావడం లేదని వారు ఆ లేఖల్లో పేర్కొన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తలు ప్రసారమైన గంట వ్యవధిలోనే వారంతా అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యక్షమయ్యారు. అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు సమావేశ మందిరంలోకి అడుగు పెడతారా? లేదా? అన్న విషయం తేలాల్సి ఉంది.

  • Loading...

More Telugu News