: ఎడ్ల పందాలకు వెళ్లి గుర్రపు స్వారీ చేసిన బాలయ్య
ఎడ్ల పందాలను ప్రారంభించేందుకు వెళ్లిన టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాలిలో నిన్న మొదలైన ఎడ్ల పందాలను బాలయ్య ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగడా చేతబట్టి జ్యోతి ప్రజ్వలన చేసిన బాలయ్య ఎడ్ల పందాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన అక్కడే గుర్రపు స్వారీ చేసి తన అభిమానులను అలరించారు. బాలయ్య గుర్రంపై స్వారీ చేస్తుండగా, ఆయన అభిమానులు గుర్రం వెంట పరుగులు పెడుతూ కేరింతలు కొట్టారు.