: దేవినేని ‘డేట్’ ను మార్చేసిన చంద్రబాబు!... 2019 మార్చి 29లోగా పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రకటన
ఏపీ సాగునీటి రంగంలో కీలక ప్రాజెక్టుగా పరిగణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తామని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిత్యం ప్రకటిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఆయన నోట నుంచి పోలవరం ప్రాజెక్టు, దానిని ఎప్పటిలోగా పూర్తి చేస్తామన్న మాట రానిదే ప్రసంగం పూర్తి కావడం లేదు. 2018లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఏపీ అసెంబ్లీలో నిండు సభ సాక్షిగా ఆ గడువు తేదీని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మార్చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, పోలవరం ప్రాజెక్టును 2019 మార్చి 29 నాటికి పూర్తి చేసి తీరతామని ఆయన ప్రకటించారు.