: చైనా పర్యటన ఖర్చు రూ.2.76 కోట్లు: సీఎం కేసీఆర్
ఇటీవల తన చైనా పర్యటన వృథా కాలేదని, 13 బిజినెస్ మీటింగ్స్ కు హాజరయ్యానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. టీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఆయన వివరణ ఇచ్చారు. చైనా పర్యటనపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. చైనా పర్యటనలో పదిహేడు మందితో కూడిన బృందానికి మొత్తం అయిన ఖర్చు రూ.2.76 కోట్లు అని, ఇందులో విమాన చార్జీలు రూ.2 కోట్లు కాగా, ఆహారం, బసకు సంబంధించి రూ.76 లక్షలు ఖర్చయిందని తెలిపారు.