: పదవులు కావాలనుకున్నవారు పార్టీలు మారారు: రావుల


పదవులు కావాలనుకున్న వారు పార్టీలు మారారని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో టీడీపీ భవన్ లో ఆయన మాట్లాడుతూ, పరువు కావాలనుకున్న వారు పార్టీలోనే ఉన్నారని అన్నారు. పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అవకాశాలన్నీ అనుభవించిన వారు పార్టీలు మారి పదవులు సంపాదించుకున్నారని ఆయన మండిపడ్డారు. నేతలు పార్టీలు మారినా కార్యకర్తలు మారలేదని అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని ఆయన చెప్పారు. తెలంగాణకు టీడీపీ అవసరం ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News