: నేను ఇంటికెళ్లేందుకు సిద్ధం...అయితే లోపాలు సమీక్షించండి: పాక్ కోచ్ వకార్ యూనిస్
టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శనతో నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టుకు అవమానకరమైన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. పాక్ చేరుకున్న తరువాత జట్టు ప్రదర్శనపై కోచ్ వకార్ యూనిస్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి నివేదిక అందజేశాడు. జట్టులో గ్రూపులు, వర్గాలు లేవని ఈ నివేదికలో స్పష్టం చేశాడు. ఆటగాళ్లు విఫలం కావడం వల్ల టోర్నీ నుంచి జట్టు నిష్క్రమించిందని పేర్కొన్నాడు. జట్టును రూపొందించడంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నాడు. జట్టు ఎక్కువ మ్యాచ్ లు ఆడకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడ్డాడు. దేశవాళీ టోర్నీల ద్వారా గతంలో వచ్చినంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లు రావడం లేదని నివేదికలో స్పష్టం చేశాడు. దీనికి కారణం స్వదేశంలో టోర్నీలు జరగకపోవడమేనని తెలిపాడు. 'తన వల్ల నష్టం జరిగింది, జట్టు నుంచి వెళ్లిపోమని కోరితే' తనకు అభ్యంతరం లేదని వకార్ యూనిస్ స్పష్టం చేశాడు.