: ఏప్రిల్ 30న బాలీవుడ్ భామ బిపాసా బసు పెళ్లి
బాలీవుడ్ నటి బిపాసా బసు ఎట్టకేలకు పెళ్లి కూతురుకానుంది. మోడల్ గా రాణించి సినీ రంగప్రవేశం చేసిన బిపాసా బసు...ఒళ్లు దాచుకోకుండా కష్టపడింది. ఈ క్రమంలో డినో మోరియా, జాన్ అబ్రహాంతో సుదీర్ఘ ప్రేమాయణం నడిపింది. ఇంకొంతమందితో షార్ట్ టైం ప్రేమాయణాలు నడిపినప్పటికీ తొందర్లోనే వాటి నుంచి బయటపడింది. ఈ క్రమంలో ఇద్దరు భార్యల నుంచి విడాకులు తీసుకున్న కరణ్ సింగ్ గ్రోవర్ తో బిపాసా 'ఎలోన్' సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడ్డ సాన్నిహిత్యం వారిద్దరినీ పెళ్లి పీటలవరకు నడిపించింది. అయితే కరణ్ రెండో భార్య జెన్నిఫర్ వింగెట్ తో అధికారికంగా విడాకులు మంజూరు కాకపోవడంతో వీరిద్దరూ పెళ్లిపై ప్రకటన చేయడం లేదని బాలీవుడ్ సమాచారం. అయితే, వీరిద్దరూ ఏప్రిల్ 30న వివాహ బంధంతో ఒక్కటి కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కరణ్ సింగ్ గ్రోవర్ కి ఇది మూడో పెళ్లి!