: వాళ్లిద్దరే నాకు స్ఫూర్తిదాయకం: కత్రినా కైఫ్


బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తనకు స్ఫూర్తి నిచ్చిన వ్యక్తుల గురించి ప్రస్తావించింది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, టెన్నిస్ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ తనకు స్ఫూర్తి నిచ్చిన వ్యక్తులని కత్రినా పేర్కొంది. ముంబయిలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. ఇందిరా గాంధీ, సెరెనా విలియమ్స్ లు వారు ఎంచుకున్న రంగాల్లో దూసుకుపోయారని, ఆయా రంగాల్లో పురుషుల కంటే మహిళలు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించిన గొప్ప వ్యక్తులని, అందుకే వారు తనకు స్ఫూర్తి దాయకమని కత్రినా అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News