: అతని గుండె ఎంతుందో తెలుసుకుందామని కోసి చూశా: కోర్టులో బంగ్లాదేశ్ యువతి


బంగ్లాదేశ్ న్యాయస్థానంలో ఓ యువతి చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తి సహా కోర్టులో ఉన్న వారందర్నీ షాక్ కు గురి చేశాయి. వివరాల్లోకి వెళ్తే...ఫతేమా అఖ్తర్ సొనాలీ (21) అనే మహిళ, షిపాన్ (28) అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. షిపాన్ ను వివాహం చేసుకోవాలని సోనాలీ కోరగా అందుకు ఆ యువకుడు అంగీకరించలేదు. అంతే కాకుండా సోనాలీతోనే కాకుండా ఇతర మహిళలతో కూడా సన్నిహితంగా గడిపిన క్షణాలను వీడియోలుగా తీసి తన ల్యాప్ ట్యాప్ లో భద్రపరిచాడు. వీటిని చూసిన సొనాలీ, షిపాన్ తనను మోసం చేశాడని గ్రహించింది. దీంతో అతనిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. దీంతో కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు ఇచ్చి అతనిని హత్య చేసింది. అనంతరం అత్యంత కిరాతకంగా అతని గుండెను అతని శరీరం నుంచి వేరు చేసింది. విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఇంత మందిని ప్రేమించిన అతని గుండె ఎంత విశాలమైనదో చూసేందుకు అతని శరీరం నుంచి గుండెను వేరు చేసి చూశానని చెప్పింది. దీంతో ఆమెను దోషిగా పరిగణించిన న్యాయస్థానం, మరణశిక్ష విధించింది. కాగా, బంగ్లాదేశ్ లో సాధారణంగా మహిళలకు మరణశిక్షను విధించరు. దీంతో ఈ కేసులో ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఒకవేళ ఉన్నత న్యాయస్థానం కూడా ఇదే నిర్ణయం ప్రకటిస్తే బంగ్లాదేశ్ చరిత్రలో మరణిశిక్ష పడిన తొలి మహిళగా సొనాలీ నిలవనుంది.

  • Loading...

More Telugu News