: ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకుండానే వెయ్యి పరుగులు పూర్తి చేశాడు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీట్వంటీల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా సాధించకుండానే ధోనీ ఈ ఘనత సాధించడం విశేషం. ఇంతవరకు 67 మ్యచ్ లు ఆడిన ధోనీ 1026 పరుగులు చేశాడు. ఇందులో 2012లో సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టుపై చేసిన 48 (నాటౌట్) పరుగులే అత్యధికం కావడం విశేషం. టీ20ల్లో వెయ్యి పరుగుల క్లబ్ లో ధోనీ కంటే ముందు యురాజ్ సింగ్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ధోనీ వెయ్యి పరుగుల క్లబ్ లో చేరడం విశేషం.