: 'గ్యాంగ్ లీడర్' పాటకు మెగా హీరోల డ్యాన్స్!
చిరంజీవి చిన్న కుమార్తె వివాహం బెంగళూరులోని ఫాంహౌస్ లో ఆత్యంత ఆప్తుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత్ లో చిరంజీవి ఫ్యామిలీ అదిరే స్టెప్పులతో సందడి చేసింది. 'రాక్షసుడు' సినిమాలోని 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' పాటకు కూతురు సుస్మితతో కలసి చిరంజీవి స్టెప్పులేసి ఆహూతులను అలరించారు. ఇక, మెగా కుటుంబ యువ హీరోలంతా కలిసి చిరంజీవి నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా టైటిల్ సాంగ్ కు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.