: శాసనసభలో ఉరిమే ఉత్సాహంతో చంద్రబాబు... నవ్వుతూనే చరకలంటించిన ముఖ్యమంత్రి!


ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎప్పుడూ గంభీరంగా ఉంటూ, లెక్కలతో కూడిన ఉపన్యాసాలు దంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు తన వ్యవహారశైలికి భిన్నంగా కనిపించారు. శాసనసభలో ఉన్నంత సేపు ఆయన ఉరిమే ఉత్సాహంతో నవ్వుతూ కనిపించారు. ప్రతిపక్షాన్ని విమర్శించే సమయంలో కూడా ఆయన నవ్వుతూనే చరకలంటించడం విశేషం. ఆయన నేటి సభలో నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడడంతో విపక్ష సభ్యులు కూడా నవ్వుతూనే విమర్శలు సంధించారు. 'అసలు జగన్ ఎందుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడో తెలియదంటూ' చంద్రబాబునాయుడు కాసింత సెటైర్ తో కూడిన నవ్వుతో కామెంట్ చేయడం ఆసక్తి రేకెత్తించింది. బాబు నవ్వినంతసేపు, జగన్ కూడా నవ్వుతూనే వుండడం విశేషం. ఆ తరువాత తన ప్రసంగంలో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

  • Loading...

More Telugu News