: ‘సహారా’ ఆస్తులను అమ్మేయండి!... సెబీకి సుప్రీం ఆదేశం


సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ కి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం షాకిచ్చింది. డిపాజిట్ల పేరిట వేలాది కోట్ల రూపాయలను సేకరించిన సహారా గ్రూప్ మెచ్యూరిటీ అయిన బాండ్లకు డబ్బులు చెల్లించడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిపాజిటర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కోర్టులు సుబ్రతోరాయ్ అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేశాయి. ప్రస్తుతం జైలు గదిలో మగ్గుతున్న సుబ్రతో రాయ్... బెయిల్ తెచ్చుకునేందుకు కూడా డిపాజిట్ మనీ లేక మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు... సెబీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. సహారా ఆస్తులను అమ్మేసి... ఆ సంస్థ పడ్డ బకాయిలను వసూలు చేసుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News