: కొడుకు చేసిన పనికి అల్లు అర్జున్ షాక్ తిన్నాడు!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షాక్ తిన్నాడు. ట్విట్టర్ ఖాతాను సెల్ ఫోన్ లో ఓపెన్ చేసిన అల్లు అర్జున్ అందులో పాటలు పోస్టు చేసి ఉండడం చూసి షాక్ తిన్నాడు. తన ఫోన్ పాస్ వర్డ్ తన కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికీ తెలియదు...తాను తప్ప ఇంకెవరూ వినియోగించరు. అలాంటప్పుడు ఈ పాటలు ఎలా ప్రత్యక్షమయ్యాయని ఆలోచించగా...కాసేపటి క్రితం తన కుమారుడు అయాన్ తన ఫోన్ తో ఆడుకున్న విషయం గుర్తువచ్చింది. దీంతో ఈ పని తన కుమారుడిదే అని గుర్తించి...'ఓ మై గాడ్! ఐయామ్ షాక్డ్...చిన్నపిల్లలు చాలా త్వరగా విషయాలు నేర్చుకుంటారని తెలుసు. మరీ ఇంత తొందరగా నేర్చుకుంటారని తెలియదు. అయినా ఈ పని చేయడానికి నాకు పది నిమిషాల సమయం పడుతుంది. వాడు క్షణాల్లో ఈ పని చేసేశాడు' అని అల్లు అర్జున్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాసేపటి తరువాత తన భార్య స్నేహ వచ్చి అయాన్.. పవన్ కల్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' పాటను పోస్టు చేశాడని, ఒకవేళ అదే మరో హీరోదైతే పరిస్థితి ఏంటని ఆమె హెచ్చరించిందని అల్లు అర్జున్ పేర్కొన్నా. ఏమైనా, ఇకపై వాడితో తాను కాస్త జాగ్రత్తగా వుండాలని బన్నీ అన్నాడు.