: మీ బోడి బహుమతులు మాకేమీ వద్దు: ఒబామా పర్యటనపై నోరు విప్పిన ఫిడెల్ కాస్ట్రో
ఎన్నో దశాబ్దాల తరువాత క్యూబాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించిన వేళ, 89 ఏళ్ల క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో తొలిసారిగా స్పందించారు. "అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా గుండెపోటు వస్తుంది. క్యూబా రాజకీయాలను ప్రభావితం చేసే ఆలోచన వద్దే వద్దని ఆయనకు నేను సలహా ఇస్తున్నా. మా దేశానికి ఆయన ఇవ్వాలనుకుంటున్న బహుమతులు వద్దు" అని అన్నారు. 2006లో తన సోదరుడు రౌల్ కాస్ట్రోకు పాలనా బాధ్యతలు అప్పగించిన ఆయన, అప్పటినుంచి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. క్యూబా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలన్న ఆలోచన వద్దని హితవు పలికిన ఆయన, క్యూబాకు వచ్చిన ఒబామా, తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాల వారితో సమావేశం కావడాన్ని 47 సంవత్సరాల పాటు క్యూబాను పరిపాలించిన ఫిడెల్ కాస్ట్రో తప్పుబట్టారు.